హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా గొల్లమాడ–తిమ్మాపూర్ రహదారి

NRML: నర్సాపూర్ (జి) మండలం గొల్లమాడ గ్రామం నుంచి నిర్మల్ వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గొల్లమాడ నుంచి తిమ్మాపూర్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో రోజూ వందలాది మంది తమ వాహనాల్లో జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి దెబ్బతినడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.