హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట దిగుబడిపై ఆందోళనతో రైతు మృతి

ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలం కచ్కంటికి చెందిన రైతు బొల్లి రాజేశ్వర్ (66) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండేళ్లుగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేక అప్పుల భారం పెరిగింది. ఈ ఏడాది వర్షాభావంతో దిగుబడి తగ్గుతుందనే ఆందోళనతో ఈ నెల 13న పురుగుమందు తాగారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు రూ.1.35 లక్షల పంట రుణం ఉన్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు.