JN: దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో సద్దుల బతుకమ్మను 9వ రోజుకు బదులుగా 7వ రోజే ఘనంగా జరుపుకుంటారు. గతంలో తొమ్మిదో రోజు బతుకమ్మ నిమజ్జనం సమయంలో ఊర్లో పెద్ద ఎత్తున గుడిసెలు కాలిపోవడం, ఏడు ఎడ్ల బండ్లు నీటిలో మునిగిపోవడం వంటి ఘటనలు జరిగాయని, వాటిని అరిష్టంగా భావించి అప్పటి నుంచి ఏడో రోజే సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
తెలంగాణ
పెద్దమడూరులో నేడే సద్దుల బతుకమ్మ


