హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ సర్క్యూట్‌తో లారీలో అగ్నిప్రమాదం

కాకినాడ: తుని మండలం రాజుల కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఐరన్ లోడ్ లారీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.