హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీఎం బీభత్సం.. ఒకరు మృతి..!

SRPT: బాలెంల స్టేజ్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాకింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారి పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.