హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ అధికారుల ప్రమోషన్లకు లైన్ క్లియర్

JGL: వ్యవసాయ శాఖలో పదోన్నతులకు ఎదురైన న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం పట్ల TADA సంఘం సంతోషం వ్యక్తం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అధికారులకు మేలు జరిగేలా సమస్యను పరిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సంఘం రాష్ట్ర నేతలు జగిత్యాలలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, సల్మాన్, మధుమోహన్ తదితరులున్నారు.