హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

గద్వాల పట్టణంలోని తేరు మైదానంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి అన్ని వార్డుల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడి అలరించారు.