హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

VKB: వైద్య కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. గురువారం అనంతగిరి గుట్టలోని వైద్య కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారితో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని సమస్యలు, భోజన సదుపాయాలు, ఇతర మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.