హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే

NZB: దేవీ నవరాత్రులను పురస్కరించుకొని నగరంలోని వినాయక్ నగర్, సుభాష్ నగర్ ప్రాంతాల్లో పలు దుర్గామాత మండపాలను గురువారం అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సందర్శించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు చేసిన అలంకరణ ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరారు.