మధ్యప్రదేశ్ మందసౌర్లో భారీగా నగదు దొరకటం కలకలం రేపుతోంది. సర్పంచ్ భవానీశంకర్ మీనా ఇంటి వెనుక ఉన్న స్కార్పియోలో రూ.1.29 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. వెంటనే నగదును సీజ్ చేసిన అధికారులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నగదుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
సర్పంచ్ ఇంటి వెనక రూ.1.29 కోట్ల నగదు సీజ్


