హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయనగరం కలెక్టరేట్‌లో గురువారం డీఆర్వో సత్తిబాబు ఆధ్వర్యంలో స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించి, సమస్యలు పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. పీజీఆర్ఎస్‌కు డీటీల నియామకం, రీసర్వే రికార్డులకు సమయం, నిధుల కేటాయింపు తదితర అంశాలపై విజ్ఞప్తి చేశారు.