హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆదివాసీ స్థానాల అన్‌రిజర్వుడ్ రద్దు చేయాలి'

ASR: 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను అన్‌రిజర్వుడ్‌గా ప్రకటించడం అన్యాయమని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ అన్నారు. హుకుంపేట, పెదబయలు, పాడేరు తదితర ప్రాంతాల్లో అన్‌రిజర్వుడ్ స్థానాలను తక్షణమే రద్దుచేసి ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఆదివాసీ చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు.