హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టులా.. రీల్స్‌ చేసేవాళ్లా? తెలియట్లేదు: కేంద్రం

ఢిల్లీ నిరసనల్లో మహిళా జర్నలిస్తులపై వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల టైంలో చాలా మంది మైక్‌ పట్టుకుని కన్పిస్తున్నారని చెప్పారు. ఈ టెక్నాలజీ యుగంలో రీల్స్ చేసేవాళ్లు ఎవరో.. స్వతంత్ర జర్నలిస్టులు ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు. అయితే మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదన్నారు.