ASR: మహిళల రక్షణ, రోడ్డు భద్రత, గంజాయి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. జీకేవీధిలో గురువారం గిరిజనులతో ముచ్చటించారు. అనంతరం గంజాయి నివారణ, రోడ్డు ప్రమాదాలు, మహిళల రక్షణపై బాధ్యతగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. చింతపల్లి ఏఎస్పీ మహేంద్ర సిన్హా, జీకేవీధి తహశీల్దార్ అన్నాజీరావు, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం


