హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమిలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి వరకు CM చంద్రబాబు, జనసేన నేతల మధ్య చర్చలు కొనసాగాయి. విజయవాడ సహా పలు కార్పొరేషన్లు, 20కి పైగా మున్సిపాలిటీలు జనసేనకు, రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీలు బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను గురువారం లేదా శుక్రవారం ప్రకటించే అవకాశముంది.