VSP: మూడు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ క్రమంలో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కావున, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!


