SKLM: మందస తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ బి. శ్రీహరి, ఎంపీడీవో వై. వెంకటరమణ అధికారులకు పలు సూచనలు చేశారు. తమ పరిధిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో ఏ. తిరుమల కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నియమావళి పై సమావేశం


