హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆధునిక పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలి'

AKP: పాయకరావుపేట మండలం సీతారాంపురంలో మండల వ్యవసాయశాఖ, తాండవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మహిళా కిసాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప వ్యవసాయ అధికారిణి నాగమణి మాట్లాడుతూ.. మహిళలు వ్యవసాయంలో భాగస్వాములు కావాలన్నారు. అధిక దిగుబడులతో పాటు నాణ్యత సాధించాలని సూచించారు. సీఈవో సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతులతో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నారు.