హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగం వలసలో పారిశుధ్య సమస్యలు

PPM: సంగం వలస గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కన్వీనర్ పి. సంగం డిమాండ్ చేశారు. డొంకడ వీధిలో ఏడాది కాలంగా కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమల బెడద పెరిగిందని తెలిపారు. సంగం వలస నుంచి కొత్తపట్నం వరకు కాలువల పూడికలు తొలగించి, అవసరమైన చోట కొత్త కాలువలు నిర్మించాలని అధికారులను కోరారు.