హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రబాస్ బతుకమ్మ.. ఊరంతా సందడే!

KMM: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు అరెంపుల గ్రామంలో ప్రబాస్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. సుమారు 500 మంది మహిళలు, గ్రామస్తులు పాల్గొనడంతో పూల పండుగ సందడి నెలకొంది. ఆటపాటలు, DJలు, భారీ LED స్క్రీన్లు, బాణసంచా వెలుగులతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది. గ్రామస్తులందరినీ ఒక్కచోట చేర్చిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.