హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛైర్పర్సన్ అభ్యర్థిగా ఇందుమతి

PPM: పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పాలవలస ఇందుమతిని గురువారం ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి పాలకొండలో నిర్వహించిన సమావేశంలో అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు. ఇందుమతి గతంలో పాలకొండ ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. ఆమె భర్త పాలవలస రాజశేఖరం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.