హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్‌కు పురస్కారం

AKP: అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఆత్మ సంస్థలో ఉత్తమ సేవలందించినందుకు పాయకరావుపేట బ్లాక్ అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ పైల సత్యవేణికి పురస్కారం లభించింది. గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమెకు పురస్కారం అందించింది. గత 12 ఏళ్లుగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం ఆమె అందిస్తున్నారు.