హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాఫ్ మారథాన్.. ఈ నెల 17న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

వరంగల్: హాఫ్ మారథాన్ నేపథ్యంలో అక్టోబర్ 17న ఉదయం 4 నుంచి 10 గంటల వరకు వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ శ్వేత తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు వడ్డేపల్లి చర్చి-కేయూసీ మీదుగా మళ్లింపు ఉంటుంది. సీఎస్ఆర్ గార్డెన్-అదాలత్, అంబేడ్కర్-కాలేజీ జంక్షన్, ఫాతిమా-ఎన్ఐటీ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదు అని తెలిపారు.