హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిన్నారులతో కలిసి దసరా వేడుకలు'

SKLM: జిల్లా కలెక్టరేట్‌లో గురువారం చిన్నారుల దసరా వేడుకలు సందడిగా జరిగాయి. జేబీటీ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులు ఆయనకు పూల విల్లును అందజేయడంతో కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. వారితో కలిసి వేడుకల్లో పాల్గొంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.