హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

KNR: హుజురాబాద్ మండలం రాజపల్లిలో శంకరపట్నంకు చెందిన నెల్లి తిరుపతి(43) అనుమానాస్పద స్థితిలో మ‌ృతి చెందాడు. అమ్మమ్మ ఇంటికొచ్చిన అతడు కనిపించకుండా పోయి, వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. నీరు ఎక్కువగా ఉండటంతో ఫైర్, పోలీసు సిబ్బంది శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.