ATP: అనంతపురం రామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 'ప్రజాదర్బార్' నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల


