హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తిపై గొడ్డలితో దాడి.. తీవ్రగాయాలు

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. లక్కం తిరుపతి అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన పన్నాల సంతోష్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతిపై దాడి చేసేందుకు ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నాడని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.