హైదరాబాద్: 28°C
తెలంగాణ

లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు

KNR: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఐదవ రోజు గురువారం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి స్కందమాత అవతారంలో పండ్ల అలంకరణలో శ్రీ మహాదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.