హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం: ఎమ్మెల్యే

VKB: తాండూరులోని శ్రీ సద్గురు పోట్లి మహారాజ్ దేవాలయంలో నూతన వ్యాపార సముదాయాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. దేవాలయ ఖాతాలోని నిధులు రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెరిగాయని తెలిపారు. ఆలయ ఆదాయాన్ని మరింత పెంచి, దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.