హైదరాబాద్: 28°C
తెలంగాణ

లైసెన్స్ లేదు.. పరిశుభ్రత లేదు.. కోవా సీజ్!

RR: తెల్లవారుజాము నుంచే అధికారులు రంగంలోకి దిగి 6 డెయిరీ ఉత్పత్తుల తయారీ యూనిట్లు, ఒక రవాణా కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, FSSAI లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం, సరైన ఉష్ణోగ్రతలో ఉత్పత్తులను నిల్వ చేయకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. ప్లాస్టిక్ కవర్లలో డీసీఎంల ద్వారా తరలిస్తున్న 3.6 టన్నుల కోవాను సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు.