హైదరాబాద్: 28°C
తెలంగాణ

డెయిరీ యూనిట్లకు నోటీసులు.. కోవా సీజ్

MDCL: నగర పరిసరాల్లో TG SAFE ఫుడ్ వింగ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. CURE పరిధిలోని 6 డెయిరీ యూనిట్లతో పాటు రవాణా కేంద్రంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో FSSAI లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో తయారీ, సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. బస్సుల్లో తరలిస్తున్న 3.6 టన్నుల కోవాను సీజ్ చేసి, సంబంధిత యూనిట్లకు నోటీసులు జారీ చేశారు.