హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

JGL: ధర్మపురిలో నూతన ఆరోగ్య ఉపకేంద్రం, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, తాగునీటి పైపులైన్లను గురువారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆర్డీఓ మధుసూదన్, DMHO సుజాత, గ్రంథాలయ ఛైర్మన్ దినేష్ పాల్గొన్నారు.