హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పు చేసినా.. భవిష్యత్తు కోల్పోకూడదు!

HYD: సైదాబాద్‌లో బాలుర కోసం రూ.1,00,69,786 వ్యయంతో G+1 అబ్జర్వేషన్ హోమ్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తప్పులు చేసి దారి తప్పిన బాలలను శిక్షించడం మాత్రమే కాదు.. వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఆశ్రయం, కౌన్సెలింగ్, పునరావాసంతో పిల్లలకు కొత్త జీవితాన్ని అందించి, నేరస్థులనే ముద్ర పడకుండా భవిష్యత్తుకు బాటలు వేయనుంది.