హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకు హోంశాఖ కార్యదర్శి క్షమాపణలు

ఢిల్లీ నిరసనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. 24 గంటల పాటు సెల్యులర్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని పోలీసులు కోరారని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నెల 9 రాత్రి 10 గంటల నుంచి 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు రైసినా హిల్స్ చుట్టూ 4 కి.మీ పరిధిలో సెల్యూలర్ సేవలను మాత్రమే నిలిపివేశామన్నారు.