KNR: రంగారావుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి శంకరయ్య మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పాల్గొన్నారు.
తెలంగాణ
పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ


