హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటకులకు గుడ్ న్యూస్

అరకు అందాలను ఒక్క రోజులో చూసేందుకు IRCTC విశాఖ నుంచి రైల్‌ కమ్‌ రోడ్‌ ప్యాకేజీ అందిస్తోంది. ఉదయం 7కు విశాఖ స్టేషన్‌ నుంచి రైలులో బయలుదేరి, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ సందర్శన; తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్‌, బొర్రా గుహలు చూపిస్తారు. స్లీపర్‌ నలుగురు షేరింగ్‌కు రూ.1,915 నుంచి ధర మొదలవుతుంది.