హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ అప్‌డేట్‌కు ప్రత్యేక శిబిరం

AKP: విద్యార్థుల ఆధార్ వివరాల నవీకరణ కోసం ఈ నెల 20 వరకు నక్కపల్లి మండల వనరుల కేంద్రంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో-1 కే. నరేష్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. బయోమెట్రిక్ వివరాలతో పాటు ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ తదితర తప్పులను సరిచేసుకోవాలని సూచించారు.