హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొండమల్లేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.