హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముసుగులు తొడుగుతున్న పంచాయతీ సిబ్బంది

VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిలో భాగంగా కొత్తవలస కూడలిలోని విగ్రహాలకు గురువారం ముసుగులు వేశారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఆదేశాల మేరకు శానిటరీ మేస్త్రీ ప్రసాద్ పారిశుధ్య కార్మికులతో ఈ చర్యలు చేపట్టారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.