హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'2027 పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పించాలి'

E.G: రాజమండ్రి డివిజన్ సబ్‌ కలెక్టర్ శుభం నోఖ్వాల్ గురువారం 2027 గోదావరి పుష్కరాల సన్నాహకాలపై సమావేశం నిర్వహించారు. పుష్కరాల ప్రత్యేక ఉప కలెక్టర్ మహేష్‌తో పాటు రాజమండ్రి అర్బన్, రూరల్, రాజానగరం, కడియం, సీతానగరం, కోరుకొండ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. 2027 పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.