హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో నామినేషన్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన

GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జేఎంజే కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్, కౌంటింగ్ కేంద్రాలను కమిషనర్ రామ అప్పలనాయుడు, త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కరిముల్లాతో కలిసి పీలించారు. కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.