హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతిరాజుకు ముంబై కోర్టులో ఉపశమనం

VZM: 2017 నాటి విమాన భద్రతా ఉల్లంఘన కేసులో పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో పాటు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ప్రధాన నిందితుడిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో, ఇతర అధికారులపై కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.