హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్‌ల కేంద్రాల వద్ద భద్రతపై పోలీసుల ఆరా

W.G: నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో గురువారం నామినేషన్‌ల దాఖలాకు చేపట్టిన ఏర్పాట్లను టౌన్ సీఐ ఆకుల రఘు పరిశీలించారు. నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన పోలీసు బందోబస్తు, భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్‌ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.