హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి'

TPT: స్థానిక సంస్థల ఎన్నికలను నిబంధనల మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.