హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత డిఫెన్స్ శిక్షణ వాయిదా: మంత్రి

SS: ధర్మవరం నియోజకవర్గ యువత కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో నిర్వహించాల్సిన ఉచిత డిఫెన్స్ శిక్షణ కార్యక్రమం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. ఆర్మీ, పోలీస్ కొలువుల కోసం 100 మందికి అందించే ఈ ఉచిత శిక్షణను ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నిర్వహిస్తామని మంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.