హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు

VZM: బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలోని స్వయంభూ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ అర్చకుడు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం లలితా సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.