హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ ఎన్నికల సందడి షురూ

PPM: కురుపాం మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎస్టీ మహిళకు కేటాయించడంతో స్థానిక రాజకీయాల్లో సందడి మొదలైంది. ఈ పదవిని దక్కించుకునేందుకు అధికార కూటమి, వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో తమ పార్టీల తరఫున పోటీకి అర్హులైన మహిళా నాయకులను ఎంపిక చేసేందుకు ఇరు పక్షాలు కసరత్తు చేస్తున్నాయి.