NZB: మోపాల్ మండలం అమ్రాబాద్ తండాను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. మంచిప్ప రిజర్వాయర్తో ముంపు ముప్పు ఉన్న 11 నివాస ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు అందించే అవకాశాలను పరిశీలించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ
అమ్రాబాద్ తండాలో పర్యటించిన కలెక్టర్


