హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండలంలో ఏనుగుల గుంపు సంచారం

PPM: సీతానగరం మండలం సూరంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గురువారం తెలిపారు. అటువైపు ప్రయాణించేవారు, పంట పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వన్యప్రాణులను రెచ్చగొట్టవద్దని కోరారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ నిరంతరం ఏనుగుల కదలికలను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తారని వెల్లడించారు.