హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఇకపై 12 గంటల ప్రయాణం 3 గంటలకే ’

లద్ధాఖ్‌లో రూ.3,350 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు రూ.2.5 వేల కోట్లతో నిర్మించిన నిమ్ము-పడం-దర్శా రోడ్డును జాతికి అంకితం చేయడంతో 12 గంటల ప్రయాణం కాస్త 3 గంటలకు తగ్గిందని, ఇది వ్యాపారానికి ఎంతో సహకరిస్తుందని మోదీ తెలిపారు. అలాగే 'ప్రాజెక్ట్ హిమ్ సరోవర్' కింద నిర్మించిన 40 రిజర్వాయర్లను ప్రారంభించినట్లు చెప్పారు.